చెర్రీ వల్ల అంధ విద్యార్థులు హర్టయ్యారట...

October 16, 2015 | 01:07 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Bruce_Lee_Movie_Premiere_Show_Photos_niharonline_(3)

శ్రీనువైట్ల-రాంచరణ్ కాంబినేషన్ లో రూపొందించిన ‘బ్రూస్ లీ’ సినిమా ప్రీమియర్ షోను అంధ విద్యార్థులకు ముందురోజే ప్రదర్శించారు. గత వారం దేవ్‌నార్ స్కూల్‌ను సందర్శించిన రామ్ చరణ్ అక్కడి విద్యార్థులకు ఈ సినిమా ప్రత్యేక షో వేస్తానని మాట ఇచ్చాడట. అయితే వారిని స్కూల్ నుంచి తీసుకు వచ్చాడు కానీ సినిమా ప్రదర్శించే సమయంలో వారితో లేడట. విద్యార్థులు అభిమాన హీరోతో ఈ సినిమా వీక్షించాలని (వినాలని) ఎంతో ఆశ పడ్డారట. కానీ రాంచరణ్ పిల్లలను వదిలేసి విఐపీలతో కూర్చోవడంతో  ఒకింత నిరాశకు లోనయ్యారు పిల్లలు. 
ప్రీమియర్ షోను హైద్రాబాద్‌లోని ఐమాక్స్‌లో గురువారం సాయంత్రానికి ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియర్ షోకు ‘బ్రూస్ లీ’ టీమ్‌తో పాటు పలువురు ఇతర తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వచ్చిన సెలబ్రిటీలను పలకరించడం వారితో పాటు కూర్చోడంతో సినిమా చూడ్డం కన్నా, అభిమాన హీరోను కలుస్తున్నామన్న ఆనందంలో ఉన్న అంధ విద్యార్థులకు ఆయన మాటలు విందామని ఎదురు చూసి నిరాశకు గురయ్యారని విద్యార్థులు అక్కడికి విచ్చేసిన కొందరితో అన్నట్టు తెలిసింది. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ