‘బొబ్బిలి రాజా’ కు 25 ఏళ్ళు...

September 15, 2015 | 01:58 PM | 2 Views
ప్రింట్ కామెంట్
bobbili_raja_25_yrs_clebrations_niharonline4

వెంకటేష్ సినిమాల్లో బొబ్బిలి రాజా ఓ బ్లాక్ బస్టర్... ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’ అంటూ వెంకటేష్ కామెడీ కూడా బాగా పండించాడీ సినిమాలో... ఈ సినిమా తరువాత పవర్ ఫుల్ అత్త, డైనమిక్ అల్లుళ్ళ సినిమాలు ఎన్ని వచ్చుంటాయో...? 1990లో రిలీజైన ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడు. పరుచూరి సోదరులు మాటలు రాశారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఇదో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇందులోని బల్పం పట్టి భామ వళ్లో... కన్యా కుమారి కనపడక జారి... అనే పాటలు ఎప్పటికీ హిట్ చిత్రాలే... వెంకీ సోదరుడు డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇదే సినిమాతో ఓ అందాల భామ తెలుగు సినీపరిశ్రమకి పరిచయమైంది. అప్పట్లో ఈమెను శ్రీదేవితో పోల్చారు. అంత ముగ్ధమనోహరంగా ఉండే ఈ అమ్మడి ఆయుష్షు చిన్న వయసులోనే తీరిపోయింది. దివ్య భారతి తెలుగు తెరవైపు పయనించడానికి కారణమైన సినిమా ఇది. ఈ సినిమాతో దివ్య భారతికి మరో ఐదేళ్ల కాల్షీట్ లు బిజీ అయిపోయాయి. నిన్నటితో బొబ్బిలిరాజా రిలీజై పాతికేళ్లయ్యింది. ఈ సందర్భంగా వెంకీతో సహా చిత్రయూనిట్, అభిమానులు పాతికేళ్ళ పండుగ చేసుకున్నారు. కానీ  ఈ వేడుకలో హీరోయిన్ దివ్య భారతి లేకపోవడం పెద్ద లోటుగా అనిపించిందని ఇక్కడికి విచ్చేసిన పలువురు అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ