సన్నీతో వద్దని సున్నితంగా చెప్పేస్తున్నారు

November 27, 2014 | 05:34 PM | 31 Views
ప్రింట్ కామెంట్

అవకాశం ఎప్పుడొస్తుందా... అడల్ట్ స్టార్ సన్నీ లియోన్‌తో ఆడిపాడేయవచ్చని ఎదురు చూసే వాళ్లే చాలా మందే ఉన్నారు. కానీ కొంత మంది బాలీవుడ్ స్టార్లు మాత్రం సన్నీతో సినిమా అంటేనే భయపడుతున్నారట. కుర్ర హీరోలయితే ఆమెతో నటించడం ఇబ్బందికరంగా ఉంటుందని ఏకంగా మోహం మీదే చెప్పేస్తున్నారట. అయితే రెండుసార్లు అవకాశం వచ్చినప్పటికీ అక్షయ్ ఒబెరాయ్ ఆమెతో చేయడానికి ఏవేవో వంకలు చెప్పి తప్పించుకుంటున్నాడని తెలుస్తోంది. తాజాగా ‘బేమాన్ ఇష్క్’లో ఈ సెక్సీ తారతో చేయమని వచ్చిన అవకాశాన్నీ కూడా వద్దనుకున్నాడు ఈ కుర్రాడు. ఇక ఈ విషయాలపై స్పందించేందుకు సన్నీ లియోన్ నిరాకరించిందని సమాచారం. వారు ఒప్పుకొకపోతే నాకేంటి అనుకుందో ఏమో. అన్ని భాషల్లో కలిపి ఏకంగా డజను సినిమాల్లో నటించేస్తుంది. వచ్చే ఏడాదిలో సన్నీలియోన్‌ సినిమాలు మూడు విడుదల కావడానికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నాయి. మీరు లేకపోతే ఇంక నటించడానికి ఎవరు లేరనుకున్నారా ఏంటి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ