సాధారణంగా సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ మనం చూస్తూనే ఉంటాం. ప్రాణం పెట్టి మరీ నటించి కాదు కాదు జీవించి వారు ఆయా సీన్లను పండిస్తుంటారు. కానీ, తెరవెనుక జరిగే బాగోతాలు చాలానే ఉన్నాయి. ఉంటాయి కూడా. సినిమాల్లో హీరోయిన్ల చేత నటనను పండించే దర్శకులు, కట్ చెప్పాక ప్రేమాయణాలు కొనసాగించిన కథలు కొకోల్లలు. బహుశా వాటి ఇన్సిపిరేషన్ తోనే నేమో హీరోయిన్లు స్క్రీన్ ల మీద రెచ్చిపోతుంటారు. ఇక ఆయా ప్రేమాయణాలలో కొన్ని పెళ్లి పీటల వరకు వెళ్లితే, మరికొన్ని అర్థాంతరంగా ముగుస్తున్నాయి. అలాంటి వాటిల్లో బాగా తెలిసినవి, తెలియనివి మీకోసం ...
బాలీవుడ్ దర్శకుడు గురుదత్, నటి వహీదా రెహ్మన్ మధ్య అఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదో సంచలనం అయి కూర్చుంది. అప్పటికే గుర్ దత్ కి వివాహం జరిగింది కూడా. కానీ, వహీదాతో పీకల దాకా ప్రేమలో మునిగిపోయిన దత్ విఫలంకావటంతో తాగుడుకు బానిసై 1964లో మరణించారు.
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్ ఒకేసారి ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు అని మీడియా కోడై కూసింది. టాప్ హీరోయిన్లు అమీషా పటేల్, సుస్మితా సేన్ లతో ఆయన లింక్ ఉందని, ఇద్దరితో ఒకేసారి, ఒకే టైంలో డేటింగ్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. విషయం తెలుసుకున్న ఇద్దరు ఆ తర్వాత అతనితో గొడవపడి విడిపోయారంట.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి వచ్చిన వార్తలు బోలెడు. ఆయన మీద వచ్చే గాసిప్స్ గురించి జనాలకన్నా ఆయనకే ఎక్కువ ఆసక్తే ఉండేది. ఉర్మిళా, ఆంత్రామాలిని, నిషా కోఠారి, ఇలా అందరు హీరోయిన్లతో ఆయన ప్రేమాయణం కొనసాగించాడని వార్తలు వచ్చేవి. ఇక ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ పై ఇలాంటి వార్తలే వస్తున్నాయి కూడా.
మరో దర్శకుడు మనీష్ శర్మ, హాట్ బ్యూటీ పరిణితీ చోప్రా మధ్య ప్రేమవ్యవహారం నడిచేదని టాక్ నడిచింది. ఇద్దరు బోల్డెన్నీ ప్రైవేట్ మీటింగ్ లకు హాజరయ్యారని, చాలాసార్లు ఏకాంతంగా గడిపారని కూడా వార్తలు వచ్చాయి.
పాకిస్థాన్ కు చెందిన మోడల్ ఇమాన్ అలీతో అఫైర్ పెట్టుకున్నాడు దర్శకుడు ఇంతియాజ్ అలీ. ఐదేళ్ల క్రితమే పెళ్లయినప్పటికీ ఇంతియాజ్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ వార్తలతో అతని భార్య దాదాపు విడాకులు ఇచ్చిన పనిచేసింది. కానీ, చివరికి విషయం సర్దుమణగటంతో చల్లబడింది.
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ఎఫైర్ నడిపినట్లు, 2013లో వీరిద్దరు విడిపోయినట్లు వార్తలు వినిపించాయి.
ప్రాచీ దేశాయ్ రోహిత్ శెట్టి మధ్య జరిగిన వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే. ఎన్ని విమర్శలు వచ్చినా వారిద్దరు నోరు విప్పకపోవటంతో ఆ వార్త అప్పట్లో బాగానే జనాల నోళ్లలో నానింది.
మరో బ్యూటీ మహిగిల్ గురించి తెలియని వారుండరు. డైరక్టర్ దూలియాతో ప్రేమ వ్యవహారం నడిపిన ఆమె పెళ్లిదాకా వెళ్లి విడిపోయారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక విడిపోయిన జంటలే కాదు, పెళ్లి అనే బంధంతో ఒకటైన ప్రేమలు కూడా ఉన్నాయండోయ్
నేషనల్ అవార్డు డైరక్టర్ ఆదిత్య చోప్రా ఆస్థాన హీరోయిన్ గా చెలామణి అయిన రాణి ముఖర్జీ ఇప్పుడు ఆయన బార్య స్థానంలో కూర్చుంది. సినిమాల్లో నటించే టైంలో వారిద్దరు పీకలలోతు ప్రేమలో గడిపారు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నటి కల్కీ కొచ్చిన్ ని. దేవ్ డీ చిత్ర సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించటం, ఆపై విడాకులు తీసుకోవటం కూడా జరిగాయి. నటి హుమా ఖురేషీ వారిద్ధరి మధ్య చిచ్చు పెట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆమెతో అనురాగ్ డేటింగ్ లో ఉన్నట్లు బోగట్టా.
మొత్తానికి ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టినా, సక్సెస్ అయినా వారందరూ ఇప్పుడు హ్యపీగా వారి వారి వృత్తుల్లో కొనసాగుతున్నారు.