భజరంగి కథ మన తెలుగు వాళ్ళ దగ్గర అలా అలా పచార్లు చేసినట్టు అనుకుంటున్నారు. మొదటి ఈ కథ బన్నీ దగ్గరకు వెళ్ళిందట. కానీ ఎందుకో ఆ కథకి నేను కనెక్ట్ అవ్వడం లేదు అని చెప్పాడట బన్నీ. దీంతో ఆ కథని టాలీవుడ్ లోనే ఇద్దరు ముగ్గురు కథానాయకులకు వినిపించారని సమచారం. వాళ్లు కూడా `తర్వాత చూద్దాం` అన్నట్టు మాట్లాడారట. ఆ తర్వాత ఇదే కథని రజనీకాంత్ కూడా విన్నట్టు తెలిసింది. ఆయన కూడా చూద్దాం అన్నారట. దీంతో కథ అలా అలా బాలీవుడ్ వరకు వెళ్లింది. అక్కడ అమీర్ ఖాన్ ఈ కథ విని ఓకే చెప్పారట. అయితే డేట్లు సర్దుబాటు కాలేదట. ఆ వెంటనే కబీర్ ఖాన్ ఈ కథని సల్మాన్ ఖాన్ కి వినిపించడం ఆయన ఓకే అనడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ `భజరంగీ భాయ్ జాన్` వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. బాలీవుడ్ లో `బాహుబలి`ని సైతం మరిపించింది. రెండే రెండు రోజుల్లో రూః 150కోట్ల కు పైగా వసూళ్ల రాబట్టింది. ఏంటో ఈ కథ సల్మాన్ కు రాసి పెట్టి ఉంది మరీ... ఆంజనేయుడు సల్మాన్ ను కరుణించి ఇలా ఆయన చేత ఈ వేషం వేయించాడు. మన తెలుగు వాళ్ళు అందించిన రెండు కథల సినిమాలు బాహుబలి, భజరంగి భాయిజాన్ రెండూ ఇండియా మొత్తం అదరగొడుతున్నాయిప్పుడు.