భాగ్యనగరంలో భాగ్యశ్రీ సందడి

February 07, 2015 | 03:04 PM | 46 Views
ప్రింట్ కామెంట్
Bhagyasri_in_Hyderabad_niharonline

ఈ ప్రేమ పావురాన్ని ఎవరైనా మర్చిపోగలరా? సినీ ప్రేమ కావ్యాల్లో ‘మైనే ప్యార్ కియా’ ఒకటి. ఈ సినిమాలో నూనూగు మీసాల సల్మాన్ ఖాన్, పదహారేళ్ళ ప్రాయంలో భాగ్యశ్రీల జంట అందరినీ కనువిందు చేసింది. భాగ్యశ్రీ ఆ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో నటించినా, ఆ సినిమాలో వచ్చినంత పేరు మరే సినిమాకు దక్కలేదు. సినిమాలోకి ఎంటర్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రేమించిన హియాలయను పెళ్ళి చేసుకుని సంసార సాగరంలో పడిపోయింది. భర్త ఆధ్వర్యంలోనే కొన్ని సినిమాల్లో నటించింది. అప్పట్లో కొన్ని సీన్లకు హిమాలయ అభ్యంతర పెట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే భార్యశ్రీ ఇటీవల భాగ్యనగరాన్ని సందర్శించింది. ఒక వివాహ వేడుకకు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా నగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ‘‘భాగ్యనగరం నా జీవితంలో మర్చిపోలేనిది. హిమాయలతో నా ప్రేమకు తొలి అడుగు ఇక్కడే పడింది. సాలార్జంగ్ మ్యూజియం సందర్శనకు వెళ్లినప్పుడు మహారాణా ప్రతాప్ విగ్రహం ముందు నిలబడి మట్లాడారు. అప్పుడే మాకు మాటలు కలిశాయి’ అన్నారు. ఆ నాటినుంచే వాళ్ళ మనసుల్లో ప్రేమ వికసించిందని చెప్పారు. అప్పటికే హిమాలయ తన స్కూట్ మేట్ అనీ, ఇద్దరం చాలా సన్నిహితంగా ఉండేవారమని చెప్పారు. హైదరాబాద్ ట్రిప్ కు వచ్చినప్పుడు తమ ప్రేమ వికసించింది కాబట్టి తనకు భాగ్య నగరమంటే ప్రత్యేక అభిమానమని చెప్పింది భాగ్యశ్రీ. ఈ సందర్భంగా తన సుపుత్రుడు అభిమన్యుని బాలీవుడ్ లో హీరోగా రంగ ప్రవేశం చేయిస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే అభిమన్యుని భాగ్యశ్రీ మొదటి హీరో సల్మాన్ ఖాన్ ఫీల్డ్ కు పరిచయం చేయబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నట్టు భాగ్యశ్రీ చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ