సల్మాన్ బర్త్ డేకి పీకూ సర్ ప్రైజ్ గిప్ట్

December 16, 2015 | 10:54 AM | 2 Views
ప్రింట్ కామెంట్
deepika-surprise-gift-to-salman-khan-niharonline

ఇండస్ట్రీకి వచ్చి ఇన్నాళ్లైనా ఖాన్ త్రయంతో నటించలేకపోయింది పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకునే. ఒక్క షారూఖ్ మినహా మిగతా ఇద్దరితో సందడి చేయలేకపోయింది. చిన్న హీరోలతో సైతం జతకట్టేందుకు సిద్ధంగా ఉంటున్న ఈ బెంగుళూర్ భామ ఆ విషయంపై ప్రస్తావిస్తే వేదాంత ధోరణిలో సమాధానం చెబుతుంది.

ఏదీ తనంత తానై మనదగ్గరికి రాదు. అది వచ్చినప్పుడు మాత్రం వదలకూడదని అంటోంది. అమీర్, సల్మాన్ లతో నటించే అవకాశం ఇంతవరకు రాలేదు. వస్తే ఎందుకు చేయను చెప్పండి అంటూ చెబుతోంది. అయితే సల్మాన్ అప్ కమింగ్ మూవీ సుల్తాన్ లో అవకాశం వచ్చిందని మీడియా ప్రస్తావించగా అటువంటిదేం లేదని చెబుతోంది. కానీ, సల్మాన్ చాలా మంచి వ్యక్తి. ఆయనతో నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను అని అంటోంది. త్వరలో సల్మాన్ బర్త్ డే రాబోతుంది కదా. ఈ సందర్భంగా మీరు ఆయనకు ఏం గిఫ్ట్ ఇస్తారని అడిగితే... పెళ్లికూతురు అని తడబడకుండా చెప్పేసింది. అవును మరీ ఇన్నాళ్లూ కేసులతో సతమతమయిన ఈ కండలవీరుడికి పెళ్లిపై అసలు దృష్టి ఉందో లేదో? కనీసం దీపికా వ్యాఖ్యలతోనైనా పెళ్లిపై కాంసంట్రేట్ చేస్తాడేమో చూడాలి. సిల్వర్ స్క్రీన్ లో సందడి చేయపోయినప్పటికీ త్వరలో బిగ్ బాస్ షోలో వీరిద్దరు యాంకర్ లుగా మారే అవకాశం ఉండబోతుందని తెలుస్తోంది. ఆ దిశగా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ