పద్నాలుగు మంది నిర్మాతలు కలిసి మీడియాపై అంక్షలను విధిస్తూ కొన్ని ఛానెల్స్ కే యాడ్స్ ను ఇవ్వాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో మీడియా అంతా సదరు నిర్మాతలెందుకు అలా చేస్తున్నారో తెలియక తలలు పట్టుకున్నారు. ప్రమోషన్ విషయంలో అలా అంక్షలు పెట్టుకోవడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ తాను ఆ నిర్మాతల లిస్టులో లేనని అయితే ఈ విషయంపై ప్రస్తుతం చర్చ జరగుతుందని సముద్రంలో అలలు తరహాలోనే ఈ సమస్య కూడా చిన్నదేనని, రెండు, మూడు రోజుల్లో సమసి పోతుందని తెలియజేశారు.