బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘కేలెండర్ గర్ల్స్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈయన తీసిన చిత్రాలన్నీ నిజజీవితంలోని కథల ఆధారంగా తెరకెక్కించినవే. గతంలో బార్ గర్ల్స్ జీవితంపై ‘చాందిని బార్’, మోడలింగ్ గర్ల్స్ పై ‘ఫ్యాషన్’, కథానాయికల జీవితంపై ‘హీరోయిన్’ లాంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ మధ్య కేలెండర్ ఫోటో షూట్ లు ఎక్కువవుతున్న సందర్భంలో ఈ కథను తెరకెక్కించే ఆలోచన కలిగింది ఈయనకు. ఈ ఫోటోషూట్ వల్ల సదరు కంపెనీ వారికి భారీగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటు ఈ ఫోటోషూట్ లో పాల్గొన్న భామలకు భారీ రెమ్యునరేషన్, పబ్లిసిటీ, సినిమాల్లో అవకాశాలు, క్రేజ్ తో కేలండర్ అందుకే వీరి జీవితం మీద ‘కేలెండర్ గర్ల్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మధుర్. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో ఐదుగురు క్యాలెండర్ గర్ల్స్ జీవితాలలో వచ్చే మార్పులను కథాంశంగా చూపిస్తున్నారు. ఈ సినిమాలో సెక్సీ, హాట్ మోడల్స్ ను, ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించని కొత్త భామలను ఎంపిక చేసారు. ఇందులో ఈ భామలు తమ అందచందాలతో పిచ్చెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేయనున్నారు.