'ఓకే బంగారం' పై కేసు

April 08, 2015 | 12:41 PM | 103 Views
ప్రింట్ కామెంట్
ok_bangaram_case_niharonline

ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన చిత్రం‘ఓకే బంగారం’ (తమిళంలో ఓకే కన్మణి). ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. అయితే తమిళనాడుకి చెందిన కన్నణ్ అనే డిస్ట్రిబ్యూటర్ ఓకే కన్మణి చిత్రాన్ని ఆపాలంటూ నిర్మాతల మండలిలో పిర్యాదు చేశాడు. గతంలో మణిరత్నం రూపొందించిన ‘కడలి’ చిత్రానికి సంబంధించిన నష్టాలను తీర్చకుండానే ఈ సినిమాని ఎలా విడుదల చేస్తారంటూ ఆయన తన పిర్యాదులో పెర్కొన్నారు. అయితే నిర్మాతల మండలి దీనిపై ఇంకా తమ స్పందనను తెలియజేయలేదు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ