శ్రీను వైట్లపై సతీమణి కేసు

October 27, 2015 | 11:30 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Harassment-Case-Against-Sreenu-Vaitla-niharonline

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పుడు బ్రూస్ లీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగా, అనుకోకుండా ఆయన ఒక సమస్యను ఎదుక్కోవాల్సి వచ్చింది.  అది ఆయన వ్యక్తిగత జీవితంలో. వినిపిస్తున్న వార్తలను బట్టి ఆయన సతీమణి రూప ఆయనపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు ఫైల్ చేసిందట. 
వివరాల ప్రకారం... ఆమె భర్త శ్రీనువైట్లకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ కంప్లయింట్ చేసిందనీ, తనను మానసికంగా హింస్తున్నట్టు తెలిపిందట. బంజారా హిల్స్ పోలీసులు ఆమె ఇచ్చిన కంప్లయింట్ ను ఐపిసి సెక్షన్ 498 ఎ కింద నమోదు చేసుకొని, దర్యాప్తు మొదలు పెట్టారట.  కానీ ఈ లోగా రూప వైట్ల అదే రోజు కేసును వెనక్కు తీసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. 
రూప వైట్ల గతంలో కాస్టూమ్ డిజైనర్ గా సమంతకు, కాజల్ అగర్వాల్ కు దూకుడు, బాద్షా సినిమాలకు పని చేశారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ