హాట్ బ్యూటీకి రానిది అదోక్కటేనా?

January 09, 2016 | 05:46 PM | 5 Views
ప్రింట్ కామెంట్
catherine-tresa-about-malayam-niharonline

సౌత్ భాషల్లో మలయాళ భామల హవా చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. అందంలోను .. అభినయంలోను అత్యధిక మార్కులు వారివే. ఇతర భాషల్లో ప్రావీణ్యం సంగతి అటుంచితే, మాతృభాషలో వాళ్లు అనర్గళంగా మాట్లాడేస్తూ వుంటారు. కానీ తనకి అది చాతకాదంటుంది హాట్ బ్యూటీ కేథరిన్ థెస్రా వాపోతోంది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజమేనని అంటోంది.

                 'ఇద్దరమ్మాయిలతో' గ్లామర్ పరంగా ఆకట్టుకున్న ఆమె, ప్రస్తుతం 'సరైనోడు' సినిమాలో నటిస్తోంది. తమిళ .. కన్నడ .. మలయాళ భాషల్లోను వరుస సినిమాలు చేస్తోంది. తనకి కన్నడ .. హిందీ .. ఇంగ్లిష్ భాషలు బాగా తెలుసును గానీ, మాతృభాష మలయాళమే తెలియదని అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తాను మలయాళీ కుటుంబానికి చెందినదాననే అయినా, దుబాయ్ లో పుట్టి పెరగడం వలన మలయాళం నేర్చుకోలేకపోయానని అంటోంది. ఇక ఇప్పుడు నేర్చుకోవడం మొదలుపెడుతుందేమో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ