సంగీత దర్శకుడు చక్రి మరణించి మూడు రోజులైనా కాకముందే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మొదలయ్యాయి. ఆయన సతీమణి శ్రావణి తనను అత్తింటి వారు వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించింది. అయితే చక్రి మరణించి రెండు రోజులుకే కలహాలు రావడంతో కొందరు సినిమా పెద్దలు బాధపడుతున్నారు. ఈ విషయమై మీడియా వద్ద మాట్లాడ్డం మంచిది కాదనీ, కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని అన్నారు. ముందు ముందు ఏ సమస్య రాకుండా మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించానని చక్రి సతీమణి శ్రావణి తెలిపారు. చక్రి కన్నుమూసిన నాటినుంచి కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు తనను బాధించాయని మీడియాకు తెలిపారు. 11 రోజుల కార్యక్రమం పూర్తయ్యేక మా ఇరువురు కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటాం. దీనికి పెద్దలు సహకరించాలని తెలిపారు. అయితే గతంలో మేమంతా కలిసి ఒకే ఇంట్లో ఉండేవారమని, ఆయన సంతోషంగా ఉండడం ముఖ్యమని 22 రోజుల క్రితమే అన్నయ ఇంటి నుండి వేరే ఇంటికి వెళ్ళామనీ, మా నుండి శ్రావణికి ఎటువంటి హాని ఉండబోదని, ఆమె ఎందుకు మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లిందో తెలియదని చక్రి సోదరుడు మహిత్ నారాయణ చెప్పారు.