రాంచరణ్ సినిమాలతో పాటు బిజినెస్ లోనూ ఎంటరై పోయాడు. మరి ఇక కాళీ ఎక్కడుంటుంది? అనుకుంటారెవరైనా? కానీ మనసుండాలే గానీ మార్గం ఉంటుంది. మనకు నచ్చిన పనులకు సమయం ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోతుందా? రాం చరణ్ అభిరుచుల్లో మనకు తెలిసింది గుర్రపు స్వారీ... సమయం చిక్కినప్పుడు తన గుర్రాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాడేమో అనిపిస్తుంది. వీలైతే వాటిమీద ఎక్కి షికారు చేస్తాడేమో అనిపిస్తుంది... కానీ ఉపాసన చెప్పిన ఓ కొత్త విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది మనకు. తనకు చక్కగా వండటం వచ్చట. సమయం చిక్కినప్పుడు వంటగదిలోకి వెళ్ళి మంచి టర్కీ వంటలు చేస్తాడట. తాను చిన్న చిన్న సహాయాలు చేస్తుంటే, తాను మాత్రం ఘుమఘుమలాడే టర్కీ వంటల్ని తనకు ప్రేమగా వండి వార్చుతాడట. భార్యకు ఇలా చక్కని వంటలు రుచి చూపించే పురుషులు ఎంత మంది ఉంటారు చెప్పండి?