థాయ్ లాండ్ లో జైకా టీంతో చరణ్

April 15, 2015 | 05:36 PM | 62 Views
ప్రింట్ కామెంట్
Charan_Martial_Arts_Practice_in_Thailand_niharonline

సినిమాలో నటీనటుల సహజత్వం కోసం ఎంత కష్టపడుతున్నారో రాం చరణ్ విడుదల చేసిన ఫొటోలను చూస్తుంటే  తెలుస్తుంది. ఇటీవల సినిమాల్లో సన్న బడటం నుంచి బరువు వంద కేజీలకు ఆపైన పెరగడం..., విక్రమ్ ఐ సినిమాలోనూ, ఇటీవల రవితేజ కిక్ 2లో కూడా చాలా సన్నబడి కనిపించాడు. ఇంకా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ హీరోయిన్లు.... ఇలా సినిమాలో క్వాలిటీ కోసం చాలా కసరత్తులే చేస్తున్నారు. రాంచరణ్ తన సినిమా బాగా రావడం కోసం కథ కోసమే చాన్నాళ్ళు వెయిట్ చేశాడు. ఇప్పుడు కథ కుదిరి శ్రీనువైట్ల చేస్తున్న ఈ సినిమా కోసం థాయ్ లాండ్ ప్రయాణం కట్టాడు. ఈ చిత్రంలో రాంచరణ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అది నిజమన్నట్టు తాజాగా చరణ్ కొన్ని ఫోటోలను రిలీజ్ చేసారు. ప్రస్తుతం రాంచరణ్ అక్కడ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అక్కడ మార్షల్ ఆర్ట్స్ విద్యను నేర్చుకుంటూ చాలా కష్టపడుతున్నాడు. థాయ్ లాండ్ లోని జైకాస్టంట్ టీం వారి ఆధ్వర్యంలో చరణ్ శిక్షణ పొందుతున్నాడు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా రాం చరణ్ కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. అఫీషియల్ గా న్యూస్ వెలువడక పోయినా, ఈ ఫొటోలను బట్టి తలో రకంగా ఊహించేసుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ