ఆ క్లబ్ లో చేరాలని చెర్రీ వ్యూహం

October 06, 2015 | 05:07 PM | 3 Views
ప్రింట్ కామెంట్
ram-charan-Bruce-Lee-Movie-First-Look-niharonline

బాహుబలి ఇచ్చిన ఇన్ స్పిరేషన్ ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలన్నీ ఓవర్సీస్ మార్కెట్ లో బాగా బిజినెస్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని మన టాలీవుడ్ నిర్మాతలు కొంచెం ఆలస్యంగా గ్రహించారు. ఇటీవల విడుదలైన నాని ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో పది కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టాడు. దీంతో ఓవర్సీస్ అడ్వాంటేజ్ ను ఫుల్లుగా వాడేసుకోవాలని చూస్తున్నాడు రామ్ చరణ్. చిరు తనయుడికి ఇప్పటిదాకా యుఎస్ లో మిలియన్ క్లబ్ మూవీనే లేదు.  బ్రూస్ లీ సినిమాతో ఆ రికార్డు కొల్ల గొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా లేని స్థాయిలో ‘బ్రూస్’లీని అమెరికాలో రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా ఉత్తర అమెరికాలో 220 స్క్రీన్స్ లో ‘బ్రూస్ లీ’ విడుదల కాబోతోంది. బాహుబలి సినిమా కూడా ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. ఆ సినిమాకు 200 లోపు స్క్రీన్సే ఇచ్చారు. మొత్తంగా ఓవర్సీస్ రికార్డుల్ని కూడా ‘బ్రూస్ లీ’ చెరిపేస్తోంది. ఓవర్సీస్ లో మొత్తం దాదాపు 350 స్క్రీన్ లలో ‘బ్రూస్ లీ’ విడుదల కాబోతోంది. దాదాపుగా అన్ని చోట్లా ముందు రోజు ప్రిమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ