తెలుగు గడ్డపై మరో టీవీ చానల్ పురుడుపోసుకుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో మరో అధ్యాయం సృష్టించడానికి 'చరణ్ టీవీ' ప్రారంభమైంది. సినీరాజకీయ ప్రముఖుల మధ్య హైదరాబాద్ లో 'చరణ్ టీవీ' చానల్ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఛానల్ లోగో ను దర్శకరత్న దాసరి నారాయణరావు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దాసరి మాట్లాడారు. చానల్ ను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగులో మరెన్నో వినోదాత్మక టీవీ చానల్స్ రావాల్సి ఉందని, వచ్చే సంవత్సరానికి చరణ్ టీవీ మంచి స్థాయిలో వుండాలని దాసరి ఆశీర్వదించారు. చరణ్ టీవీ సిబ్బందికి పేరుపేరున శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ టీవీ చానల్ చైర్మన్ మహేశ్వరి దర్శకరత్న దాసరికి మెమోంటో అందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళా తపస్వి కే విశ్వనాధ్ లైవ్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చానల్ సిబ్బందికి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. న్యూస్ అందరి కంటే ముందే చెప్పాలన్న తపనతో తప్పులు చేయకుండా ఉండాలని, వాస్తవాలు మాత్రమే తెలుపాలని కోరారు.
నవరసాలతో ముస్తాబై వస్తున్న ఈ ఛానల్ ను ప్రేక్షకులను అలరించాలని నిర్మాత ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ కోరారు. ఎవరికి తలవంచకుండా వార్తలను ప్రసారం చేయాలని కోరారు.
చరణ్ టీవీ స్టార్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఈ టీవీ చానల్ టాప్ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నానని, చరణ్ టీవీ స్టాఫ్ కి న శుభాకాంక్షలు తెలిపారు.
దర్శక రత్న దాసరి చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందని, అయన హస్త వాసి శుభం కలిగిస్తుందని రచయిత చిన్ని కృష్ణ అన్నారు. చరణ్ టీవీ చైర్మన్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ యాదవ్ చరణ్ టీవీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఛానల్ లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించాలని కోరారు.