మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', సూపర్ 'డైరెక్టర్ 'శ్రీను వైట్ల' కాంబినేషన్ లో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం పాటల చిత్రీకరణకు ముస్తాబయ్యింది. కధానాయికగా 'రకుల్ ప్రీత్ సింగ్' రాంచరణ్ సరసన తొలిసారిగా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ 'ఈ నెల 21 నుంచి30 వరకు 'యూరప్' లో పాటల చిత్రీకరణ జరుగుతుంది. మెగాపవర్ స్టార్ 'రాంచరణ్',రకుల్ ప్రీత్ సింగ్ ల పై ఈ పాటల చిత్రీకరణ ఉంటుంది. తిరిగి జూన్ 3 నుంచి హైదరాబాద్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. "నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.
ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.
నటీ,నట వర్గం: రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, నదియ, కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, ముఖేష్ రుషి, రావురమేష్, షాయాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజి, పృథ్వి, సప్తగిరి, కారుమంచి రఘు, రవిరాజ్, సత్య, రవిప్రకాష్,సురేఖావాణి, పవిత్రలోకేష్, కష్మీరష తదితరులు. ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం; తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, స్టంట్స్: అనల్ అరసు, లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్, సమర్పణ : డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి., మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల.