రాంచరణ్ ఓ తమిళ రీమేక్ లో నటించబోతున్నట్టు ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. అక్కడ సూపర్ హిట్టయిన ‘తని ఒరువన్’ సినిమాను చెర్రీ టాలీవుడ్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. బ్రూస్ లీ తరువాత ఈ సినిమా షూటింగ్ జరపాలని చకచకా పనులు పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో తమిళంలో విలన్ గా అరవింద్ స్వామి నటించాడు. మొదట ఆయన్నే విలన్ గా తీసుకోవాలని అనుకున్నారు. ఈ సినిమాలో విలన్ గా నటించే అరవింద్ స్వామిది ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ కావడంతో ఈ రోల్ మరో పవర్ ఫుల్ నటుడైతేనే బాగుంటుందని ఒక టాక్. అయితే కొత్తగా వినిపిస్తున్న మాట ఈ రోల్ లో రాణా అయితే ఎలా ఉంటాడనేది. బాహుబలి సినిమాతో ఇందులో నటించిన వారంతా యూనివర్సల్ నటులైపోయారు. రీమేక్‌లో విలన్‌గా నటించాలని రానాను చెర్రీ రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. మరి రానా ఓకే అంటాడా మళ్ళీ బాహుబలి 2 డేట్స్ వల్ల ఇబ్బంది తెలుత్తుతుందా? అనే వేచి చూడాలి. ఇక దర్శకుడు తమిళంలో చేసిన మోహన్ రాజానే తెలుగు దర్శకత్వం కూడా చేపట్టనున్నట్టు తెలుస్తోంది.