నాజర్ నటించని పాత్ర ఉందా? విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా కూడా దూకుడులో నిరూపించుకున్నాడు. ఇప్పుడు బాహుబలిలో బిజ్జాల దేవుడిగా విలనీ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. పైగా అవిటివాడు కూడా. అయితే ఈయన నిన్న సాయంత్రం ఆసుపత్రిలో చేరడం పై పలువురు పలురకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఆయనకేమైందంటూ అందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆయనకు గుండె పోటు వచ్చి ఉంటుందంటున్నారు. ఈయన చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులో ఓ ప్రెవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారట. అయితే ఆయన భార్య కమల నాజర్ ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు. తన భర్త కొన్ని ఆరోగ్య పరీక్షలు కోసం ఆసుపత్రిలో చేరారని, అవి పూర్తి కాగానే ఇంటికి వెళతామనీ, ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదని అన్నారు.
నాజర్ కొన్నాళ్లుగా బాగా ఒత్తిడికి గురవుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన చిన్న కొడుకు రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం, మరోవైపు నడిగర్ సంఘం ఎన్నికల ఆయన విశాల్ పానెల్ లో సెక్రెటరీగా నిలబడ్డారు. ఈ వత్తిడుల కారణంగా ఆరోగ్యం దెబ్బతిని ఉండవచ్చని అనుకుంటున్నారు. తెలుగు, తమిళంలో దాదాపు ఎక్కువ సినిమాల్లో ఏదో ఒక రోల్ లో నటించే నాజర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. బిజ్జల దేవుడు వచ్చే నెల బాహుబలి 2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.