దర్శక నిర్మాత చేరన్ ప్రయత్నం సక్సెస్?

March 10, 2015 | 03:54 PM | 66 Views
ప్రింట్ కామెంట్
jk_enum_nanbanin_vaazhkai_niharonline

ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్ల సమస్య తీవ్రంగా తలెత్తుతోంది. ఈ సమస్యతో పాటు పైరసీ కూడా తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కమల్ హాసన్ తన విశ్వరూపం సినిమాను థియేటర్లతో పాటు డీటీహెచ్ ద్వారా ’ఆన్ లైన్ డిమాండ్’ రిలీజ్ చేయాలని కూడా ప్రయత్నించారు. కానీ అప్పట్లో థియేటర్ యజమానులు చాలా గొడవ చేసి ఆ ప్రయత్నాన్ని తిప్పి కొట్టారు. అయితే ఇప్పుడు ఇదే ఆలోచన దర్శక నిర్మాత చేరన్ కు కూడా వచ్చింది. ఆయన తమిళనాట శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటించిన ‘జేకే ఎనుమ్ నన్బన్ వాలక్కై’ అనే సినిమా తీశాడు. ‘ఏమిటో ఈ మాయ’ అనే పేరుతో తెలుగులో కూడా వచ్చింది. ఆయన ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయడంతో పాటు డీవీడీలు కూడా విడుదల చేశారు. పైరసీని అడ్డుకునేందుకు ఇదో కొత్త మార్గంగా ఆయన ప్రయతినంచారు. అయితే చేరన్ కు కూడా థియేటర్ల యజమానుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా వెనక్కు తగ్గకుండా సినిమా థియేటర్లలో విడుదల చేయడం మానేసి నేరుగా డీవీడీలను రిలీజ్ చేసే సాహసం చేశాడు. ఇలాంటి పద్ధతి హాలీవుడ్ లో నూ ఉందట. అయితే కోలీవుడ్లో చేరన్ మొదలు పెట్టారు. అయితే మార్చి 6న విడుదల చేసిన డీవీడీలు రెండు రోజుల్లో 10 లక్షలు అమ్ముడయ్యాయట. మొత్తంగా 25 లక్షల డీవీడు మార్కెట్ లోకి విడుదల చేసినట్టు తెలుస్తోంది. సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే మిగిలిన 15 లక్షల డీవీడీలు కూడా అమ్ముడవుతాయని అనుకుంటున్నారు. ఇలా జరిగితే ఆయన ఆలోచన సక్సెస్ అయినట్టే. ఇక రాబోయే కాలంలో నిర్మాతలు ఈ పద్ధతిని మొదలు పెట్టవచ్చు. చేరన్ సినిమా ఏమిటో ఈ మాయను ఏం చేయబోతున్నారనేది ఇంకా డిసైడ్ కానట్టుంది. ఈ సినిమా కోసం తెలుగువాళ్ళూ ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ