తన ప్రవచనాలతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్న శ్రీ రామానుజ చిన చియర్ స్వామి కులమతాలకు అతీతంగా దైవానుగ్రహాన్ని పొందవచ్చునంటూ నిరూపించారు. ఆయన జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో సినిమాగా ‘సంఘ సంస్కర్త భగవత్ రామానుజులు’ అమృత క్రియేషన్స్ పతాకంపై మర్రి జమునారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మంజుల సూరోజు దర్శకురాలు. హైదరాబాద్లోన ఈ సినిమా పాటల సీడీని చిన జీయర్ స్వామీజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘‘ఎన్నికులాలు, మతాలున్నా అందరూ కలిసి మెలిసి ఉండాలనే సందేశాన్ని అందించారు. అందరూ సమానమే అనే సత్యాన్ని ప్రవచించిన ఓ మహనీయుని జీవితం ఆధారంగా తీస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘గొప్ప ఆలోచనతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ఓ మహోన్నత వ్యక్తిత్వాన్ని తెరమీద ఆవిష్కరించే అవకాశం రావడం నిజంగా అదృష్టం. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహోమిల రామనుజ జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి, ‘గజల్’ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.