మంచువారింట్లో చిరు, బాలయ్యల సందడి

May 15, 2015 | 03:22 PM | 49 Views
ప్రింట్ కామెంట్
manchu_manoj_marriage_chiru_balayya_niharonline

మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న పెళ్లి సందడిలో ఈ ప్రముఖులు సందడి చేశారు. మోహన్ బాబు రెండో తనయుడు హీరో మంచు మనోజ్ పెళ్ళి సందడి రెండు వారాలకు ముందే మొదలైంది. మనోజ్ వివాహం ప్రణతితో ఈ నెల 20న జరుగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఐదు రోజుల పెళ్ళి వేడుకలకు మాత్రం ప్రముఖులందరినీ ఆహ్వానించారు. అంతకు ముందు మాత్రం బ్యాచ్ లర్ పార్టీలు, నలుగు, మెహందీలవంటివి జరుగుతున్నాయి. ఇప్పటికే మంచు మోహన్ బాబు ఇంటికి కుటుంబసభ్యులు, బంధువులు అందరూ చేరుకున్నారు. తాజాగా ఈ వేడుకలో టాలీవుడ్ అగ్ర నటులు బాలకృష్ణ, చిరంజీవిలు కూడా పాల్గొన్నారు. మంచు మనోజ్ షెర్వానీ దుస్తుల్లో, రాజుల నాటి కంఠాభరణంతో ఓ రాయల్ కింగ్ లాగా కనిపిస్తున్నాడు. మీసకట్టు పూర్తిగా మార్చేసాడు. ఈ 5 రోజుల పెళ్లి వేడుకలో రోజుకో విధంగా సందడి చేయనున్నారు. మెహంది, సంగీత్ కార్యక్రమాలను చాలా కొత్తగా, గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లుగా తెలిసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ