‘చిరు దోశ’ కథ ఏమిటంటే

August 25, 2015 | 01:23 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Chiranjeevi_dosa_niharonline

అల్పాహారం దోశ ప్రత్యేకత మన సౌత్ వారిదే... అలాగే ఆవిరి కుడుములు, ఇడ్లీలు వంటివి కూడా... మన సౌత్ లోనూ ఒక్కో చోట ఒక్కో విధంగా దోశలు తయారు చేస్తారు. రామ్ చరణ్ చెప్పిన మైసూర్ దోశ కథకు ప్రతి రూపమే ఈ ‘చిరు దోశ’... ! ఆయిల్ లేకుండా తయారు చేసే ఈ స్పెషల్ దోశ రుచితో పాటు చాలా ఆరోగ్యం కూడా. అందుకే ఇది చిరంజీవికి నచ్చే అల్పాహారం అయ్యింది. రాం చరణ్ 'చిరు దోశ' పేరిట పేటెంట్ హక్కులు తీసుకుని, ఆయన 60వ పుట్టినరోజుకు కానుకగా ఇచ్చాడు. ఇక ఈ దోశ గురించిన రాంచరణ్ చెప్పిన కథలోకి వెళితే... ‘‘చాలా రోజుల క్రితం నాన్నగారు మైసూర్ సమీపంలో షూటింగుకి వెళ్లినప్పుడు మార్గ మధ్యంలో ఓ చిన్న దాబా దగ్గర ఆగారు. అక్కడ టిఫిన్ గా దోశ ఆర్డర్ ఇచ్చారు. ఫిల్టర్ కాఫీతో పాటు దోశ టేబుల్ మీదికి వచ్చింది.    ఆ దోశ ఫ్లప్ఫీగా ఉండి... ఆయిల్ ఉండదు. దీంతో బటానీ చట్నీ. దోశకు పడిపోయిన నాన్నగారు ఆ హోటల్ వాళ్లను పిలిచి 'ఇది తయారు చేసే విధానం' (రెసిపీ) ఏంటి? అని అడిగారు. కానీ వాళ్లు ఆ సీక్రెట్ చెప్పడం కుదరదని అన్నారు. అది పూర్తిగా పర్సనల్ అన్నారు. దాంతో ఆ కుక్ ని మైసూర్ పిలిచి నాన్నగారు తయారీ విధానం తెలుసుకున్నారు.  తర్వాత మా ఇంట్లో చాలా ప్రయత్నించాం. కానీ అక్కడి దోశ టేస్ట్ రాలేదు. ఇంట్లో అందరం ట్రై చేశాం... చివరికి ఓ కొత్తరకం దోశ తయారైంది. అదే మా ఫేవరెట్ దోశ అయ్యింది. అందుకే ఆ దోశ పేటెంట్ తీసుకుని నాన్నగారికి కానుకగా ఇస్తున్నా.. పుట్టినరోజు వేడుకలో అతిధులకు పెట్టిన దోశ ఇదే...’’ అని చెప్పారు చరణ్. అదండీ ‘చిరు దోశ’ కథ. మరి ఈ దోశను మనం తినాలంటే ఎక్కడికి వెళ్ళాలో?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ