కలర్స్ ప్రోగ్రాం ద్వారా తన మాటల గారడీతో అందరినీ పల్టీ కొట్టించిన స్వాతి ఇప్పుడు సినిమాల్లో కాస్త బిజీ అయిపోయింది. ఈ కలర్స్ స్వాతి నాగార్జున ఇచ్చిన ఓ ఆఫర్ ను కాదనేంత బిజీ అయిపోయిందట. దీనికి బదులుగా నాగార్జున రెమ్యునరేషన్ నచ్చక ఆ ఆఫర్ ను వద్దన్నదన్న రూమర్స్ పాస్ అయ్యాయి. తాను వేరే ఫిల్మ్ షూటింగ్లో ఉన్నానని, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా మధ్యలో రాలేనుకదా అని చెబుతోంది. తాను ఇలా బిజీగా ఉంటే... లేని పోని రూమర్స్ తో తనను ఇబ్బంది పెడుతున్నారని అంటోంది. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదనీ... నాగ్‌తో తనకు మంచి ఫ్రెండ్ షిప్ వుందని, ఐనా ఆ హీరో ఆఫర్ ఇస్తే రెమ్యూనరేషన్ చాలలేదని ఎవరైనా అంటారా? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదిలావుంటే హారర్, థ్రిల్లర్, కామెడీ కాంబినేషన్‌తో హిట్ కొట్టిన ‘గీతాంజలి’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘గీతాంజలి-2’ లీడ్ రోల్‌కు కలర్స్ స్వాతి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి... మరి ఇందులోనూ నిజమెంతో ఆ చిత్రం తాలూకు వాళ్ళు కన్ఫం చేస్తేగానీ తెలియదు.