రియల్ లైఫ్ లో ఏడిపించే కమెడియన్

October 29, 2015 | 03:46 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kalyani-comments-about-brahmanandam-niahronline

బ్రహ్మానందంపై ఇలాంటి కాంట్రవర్సీ విమర్శలు చాలానే వచ్చాయి. ఒక దశలో కమెడియన్స్ అంతా కలిసి ఈయనపై మీడియా సమక్షంలో ధ్వజమెత్తారు. అతను చిన్న నిటులను చాలా కించపరిచినట్లు మాట్లాడతాడనీ, అసభ్య కామెంట్లు చేస్తాడనే టాక్స్ అప్పుడు వినిపించాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో కామెంట్లు వచ్చాయి ఆయన మీద. ఆర్టిస్ట్ ల కడుపులపై కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడంటున్నారు. తనకు నచ్చని నటీనటులు ఆయన నటించే సినిమాలో తీసుకుంటే...దగ్గరుండి వారిని తీయించేవరకూ పట్టుబడతాడట. ఒకవేళ అతనికి నచ్చని వ్యక్తులు తప్పనిసరి ఉండాలని దర్శకులు చెబితే, అయితే ను ఈ సినిమాలో నటించనని కొత్త డ్రామా ప్లే చేస్తాడట. గతంలో శివారెడ్డి వంటి నటులను ఇబ్బంది పెట్టిన బ్రహ్మానందం, తాజాగా మహిళను కూడా టార్గెట్ చేస్తున్నాడట. ఇదే విషయాన్ని నటి కరాటే కళ్యాణి బయటకి చెప్పింది..కళ్యాణి బ్రహ్మానందంతో కలిసి రవితేజ నటించిన 'కృష్ణ ' మూవీలో నటించింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయి. .ఆ తర్వాత వీళ్లు కలిసి నటించలేదు. అయితే ఆలీ తో జాలీగా ఫ్రోగ్రామ్ కు హాజరైన కళ్యాణి బ్రహ్మానందం గురించి కొన్ని నిజాలను బయటపెట్టింది. బ్రహ్మానందం తనకు సినిమాలు రాకుండా చేశాడని, వచ్చిన అవకాశాలను దగ్గరుండి పోగొట్టాడని చెప్పింది. అటువంటి వారికి ఆ దేవుడే బుద్ది చెప్తాడని ఆవేదన వక్తం చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ