పాత సీసాలో కొత్త నీరు... వర్కవుట్ అయ్యేనా?

February 23, 2015 | 04:43 PM | 46 Views
ప్రింట్ కామెంట్
comedy_scenes_edited_in_temper_niharonline

చాలా కాలం నుంచి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఊరిస్తు వస్తున్న బ్లాక్ బస్టర్ అనే దాహం టెంపర్ తో తీరిపోయింది. అయితే నిర్మాత బండ్ల గణేశ్ కు మాత్రం అది తీరనట్టుంది. అందుకే పాత సీసాలో కొత్త నీరు అనే సిద్ధాంతాన్ని ఫాలో అయిపోతున్నాడు. విషయమేంటంటే టెంపర్ విడుదలై దాదాపు 10 రోజులు కావాల్సి వస్తుంది. ఇప్పటిదాకా భారీ వసూళ్లు రాబట్టి చిత్రం రూ.40 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అయితే మొదట్లో నిడివి ఎక్కువని భావించిన దర్శకుడు పూరి చిత్రానికి బాగా కత్తెరలు పెట్టాడట. అందులో ముఖ్యంగా ఎగిరిపోయినవి ఆలీ-సప్తగిరి కామెడీ సీన్లే. వారు సినిమాలో కనిపించేది రెండు మూడు సీన్లలోనే. దీంతో వారి కామెడీ ఎపిసోడ్లపై ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోయింది. కత్తిరించిన సీన్లలో కామెడీ ఓ రేంజ్ లో ఉందని భావిస్తున్న నిర్మాత బండ్ల గణేష్ తిరిగి ఆ సీన్లను చేర్చాలని నిర్ణయించాడట. తద్వారా కలెక్షన్లను మరిన్నీ రాబట్టోచ్చనే ఫ్లాన్ లో ఉన్నాడట. ఇందుకోసం ఎడిటర్ ను పురమాయించాడని తెలుస్తోంది. అయితే ఇదేం కొత్త పద్ధతేం కాదులేండి. గతంలో కూడా కొన్ని చిత్రాలకు కలెక్షన్లు పెంచేందుకు ఉపయోగించే ఫార్ములానే ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. మరీ పాత ఫార్ములా వర్కవుటయి ప్రేక్షకులను థియేటర్ లకు క్యూ కట్టిస్తుందా? గణేశ్ ఐడియా వర్కవుటవుతుందా? చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ