క్రికెటర్ శ్రీశాంత్ తో డైరెక్టర్ శ్రీధర్

January 28, 2015 | 03:51 PM | 35 Views
ప్రింట్ కామెంట్

దర్శకుడిగా, నిర్మాతగా ఇంతకుముందు రెండు చిత్రాలు తీసిన మధుర శ్రీధర్ రెడ్డి త్వరలో క్రికెటర్ శ్రీశాంత్ తో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈయన ఇంతకు ముందు ‘మై లవ్ స్టోరీ’, ‘లాస్ట్ బెంచ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని కెరీర్ పాడు చేసుకున్న శ్రీశాంత్ ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో మధుర శ్రీధర్ ని కలవడం, ఆయన ఓ చిత్రానికి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిపోయాయి. ఈ ప్రాజెక్టు గురించి శ్రీధర్ చెబుతూ, ‘క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. ఓ క్రికెటర్ కు, సినీతారకు మధ్య ప్రేమకథగా ఇది రూపొందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం’ అన్నారు. ఈయన దర్శకత్వంలో రెడీ అయిన ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిరతం ఈ నెల 30న విడుదలవుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ