తరతరానికి సంప్రదాయాలు, కట్టుబాట్ల లో సమాజంలో వచ్చే మార్పులను యూత్ ముద్దుగా పిల్చుకునే మాట కల్చర్. ఎప్పుడూ కొత్తదనం కోసం తాపత్రయ పడే యువత ప్రవర్తిస్తున్న తీరును కామెడీగా తెరకెక్కిస్తున్న చిత్రం కల్చర్. శ్రీ నటరాజ శ్రీనివాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నలుగురు యవకులను హీరోలుగా గా నటిస్తున్నారు. బిఎన్‌పి ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా, పి. శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన నటులు జనార్థన్ అనిల్‌కుమార్, రవికుమార్‌లపై సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల క్లాప్ ఇవ్వగా, పి శ్రీనివాసరావు, ఘంటాడి కృష్ణ కెమేరా స్వీచ్ ఆన్ చేశారు. దర్శకురాలు విజయనిర్మల తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ నాకు మొదటి చిత్రం ఇది. యూత్‌కు నచ్చే కామెడీ ఎంటర్‌టైనర్‌తో పాటు చిత్రంలో మెసేజ్ ఇస్తున్నాం. యూవతకు, ఫ్యామిలీ కి నచ్చే విధంగా సినిమా తెరకెక్కిస్తున్నాం... జూన్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. రెండు షేడ్యూల్‌లో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతాం.’ అన్నారు. నిర్మాత పి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘అద్భుతమైన కథతో నలుగురు యువ హీరోలు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ కల్చర్ చిత్రం ప్రస్తుత కల్చర్ మీద సటైరికల్‌గా ఉంటుంది. యువతకు మెసేజ్ ఇచ్చే సినిమా. సంగీతానికి ఈ చిత్రం మంచి స్కోప్ ఉంది. చిత్ర విజయానికి సంగీతం ప్లస్ అవుతుంది.’ అన్నారు.