ఇది మాత్రం రీల్ పెళ్ళి కాదండోయ్... నిజంగానే ఈ సినిమా అమ్మడు పెళ్ళి చేసుకుంది. ఇంతకీ ఈ అమ్మడెవరో అందరికీ తెలియదు కదా... డి ఫర్ దోపిడీ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ ఈవిడ. మెలనీ కన్నోకడ నటనలో స్టాన్ ఫర్డ్ యూనివర్శటీ పట్టా పుచ్చుకుంది. ఆ తరువాత బ్రిటీష్ టీవీల్లో నటించింది. కొన్ని ఆంగ్ల చిత్రాల్లోనూ నటించిందట. విదేశీ పిల్లగా మంచి పేరున్నా... సినిమాల్లో మాత్రం క్లిక్ అవ్వలేదు. కోడ్ బ్లాక్, ది బ్రింగ్ లాంటి టీవీ షోలతో అమెరికాలో బాగానే పాపులర్ అయ్యింది. లవ్ లైస్ అండ్ సీత సినిమాలతో అందరిలో బాగానే గుర్తింపు పొందింది. ఇన్ని క్వాలిఫికేషన్లు, నటనానుభవం ఉన్నప్పటికీ అద్రుష్టం మాత్రం కలిసి రాలేదు. ఇక లాభం లేదనుకుందో ఏమో బాయ్ ఫ్రెండ్ ను పద్ధతిగా పెళ్ళాడ్డానికి సిద్ధమైంది. గత ఏడాది నీరజ్ చంద్రతో నిశ్చితార్థం అయిపోయింది. నిన్ననే టర్క్స్ అండ్ కైకోస్ దీవుల్లో పోళ్ళి జరిగిపోయిందట. ఇదండీ మెలనీ పెళ్ళి కథ...