శ్రీమతి సుశీల సమర్పణలో నంది కామేశ్వర రెడ్డి దర్శకత్వంలో షణ్ముఖ ఆర్ట్స్ వారు సాయి కుమార్ కథానాయకుడిగా తెలుగు కన్నడ భాషల్లో ఓ చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరిత్రను తిరగేసి చూసుకుంటే ఎన్నో ఉద్యమాలు పోరాటు నడిచాయి .. కొన్ని ఉద్యమాలు జాతుల కోసం. కొన్ని ఉద్యమాలు .. సమాజం కోసం ..మరికొన్ని ఉద్యమాలు స్వేచ్ఛకోసం జరిగాయి.. ప్రతి ఉద్యమానికి ఒక నాయకుడు ముందు ఉండి నడిపించాడు అని మనకు చరిత్ర తెలుస్తుంది. కొంత మంది పోరాటయోధులు చరిత్రలో మిగిలి పోగా కొందరి చరిత్రలు పుస్తకాలకే పరిమితం కాగా కొందరి చరిత్రలు సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి.. అదే కోవలో 12వ శతాబ్దంలోనే రాణిరుద్రమ దేవి వద్ద ప్రధాన సేనాపతిగా పని చేసిన మాచిదేవా ...చరిత్ర కూడా సినిమాగా రూపు దిద్దుకుంటోంది..
కథ విషయానికి వస్తే...
12 వశతాబ్ధంలో రాణి రుద్రమ దేవి వద్ద ప్రధాన సేనా పతిగా పని చేసిన మాచి దేవా అప్పటి రోజుల్లోనే సాంఘిక,కుల దురాచారాలపై పోరాటం చేసిప్రజలలో చైతన్యం నింపాడు . తుది వరకు ఉద్యమం కొరకు పోరాడి ఉద్యమానికే ప్రాణాలు అర్పించాడు . దర్శకుడు, నిర్మాతలు సినిమా గురించి మాట్లాడుతూ మాచి దేవా చరిత్రను సంవత్సర కాల పాటు పరిశోధించి ఇప్పటి తరం వారికి అర్థమయ్యేలా స్ర్కీన్ ప్లే మార్చి తెరకెక్కిస్తున్నాము ఆ యోధుడి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాడు సాయికుమార్ ..సాయి కుమార్ చెయ్యడంతో మాచిదేవా పాత్రకు న్యాయం జరిగిందని భావిస్తున్నాము .. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగింది సాయికుమార్ సహకారం మరవలేనిది ..ఇప్పటి వరకు బెంగుళూరు శ్రీరంగ పట్నం ..మైసూర్ లలో కొంత బాగాన్ని చిత్రీకరించాము .చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగ నుంది అన్నారు. నేను చేసిన సినిమాల్లో ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. నాటి తరం పోరాట యోధుడు అయిన మాచిదేవా పాత్ర నేను వేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకం ఉంది అన్నాడు సాయి కుమార్.
సాయి కుమార్, చారులత, సుమన్, రమ్యకృష్ణ, సత్య ప్రకాష్, సుచిత్ర, థ్రిల్లర్ మంజు తదితరులు నటించిన ఈ చిత్ర్రానికి సంగీతంః హంసలేఖ, ఫైట్స్ థ్రిల్లర్ మంజు , కథ, స్ర్కీన్ ప్లే , దర్శకత్వంః కామేశ్వర్ రెడ్డి, నిర్మాతః ద్వారంపూడి శంకర్ రెడ్డి