‘‘దండుపాళ్యం’ సినిమా గుర్తుండే ఉంటుంది మన తెలుగు వారికి... ఇందులో నటించిన ముద్దుగుమ్మ పూజా గాంధీ ఓ కన్నడ హీరోకి కోటి రూపాయలకు కుచ్చుటోపీ తగిలిస్తోందట. సినిమా నిర్మాణం నిమిత్తం ఓ కన్నడ భామ తన సహ నటుడి దగ్గర కోటి రూపాయలు తీసుకుందట కానీ ఇప్పుడేమో అతడు డబ్బులు అడుగుతుండటంతో నేను కోటి రూపాయలు తీసుకోవడం ఏంటి ? అసలు ఎప్పుదిచ్చావ్ ? డబ్బులు ఇచ్చినట్లు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే తీసుకొని రా.... అప్పుడు ఇస్తాను అంటూ ఎదురు తిరిగిందట . కన్నడ నాట హాట్ భామగా ఇమేజ్ ఉన్న ఈ భామ తిప్పాజీ సర్కిల్ అనే చిత్రంలో సురేష్ శర్మతో కలిసి నటించింది . ఆ చిత్రంలో నటించడం వల్ల ఇద్దరి మద్య మంచి సాన్నిహిత్యం ఏర్పడటంతో అభినేత్రి అనే సొంత చిత్ర నిర్మాణం నిమిత్తం కోటి రూపాయలు అడిగిందట అయితే ఆమె అడగ్గానే డబ్బులు ఇచ్చాడట కానీ పేపర్ లో రాసుకోలేదు. ఇప్పుడు సురేష్ శర్మ డబ్బులు అడుగుతుండటంతో కాగితాలు ఉంటే తీసుకురా అప్పుడు ఇస్తాను అని అంటోందట. !దాంతో షాక్ తిన్న సురేష్ తనను మోసం చేసిందంటూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి ఫిర్యాదు చేసారు. అభినేత్రి సినిమా కోసం పూజాగాంధీ కోటి రూపాయల నగదు తీసుకున్నదని ఆ డబ్బును తిరిగి ఇప్పించాలంటూ సురేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయమై పూజీ గాంధీ ఏ విధంగానూ స్పందించినట్టు లేదని అంటున్నారు. చూడాలి ఈ విషయంలో ఇంకేమైనా వార్తలు రానున్నాయేమో...