యువతకి దాసరి సందేశం...

May 04, 2015 | 05:40 PM | 148 Views
ప్రింట్ కామెంట్
DasariBirthdaCelebrations_withmike_niharonline

తెలుగు సినిమాకి దిశానిర్దేశం చేసిన వారిలో దర్శకరత్న దాసరిగారు ముందు వరుసలో ఉంటారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 151 సినిమాలను డైరెక్ట్ చేసి ప్రపంచ ఖ్యాతి సంపాదించారు. ఎక్కడో పాలకొల్లులో పేద కుటుంబలో పుట్టిన తాను ఎవరి సపోర్ట్ లేకుండా కృషి, పట్టుదలను నమ్ముకుని అవకాశాలను అందిపుచ్చుకుని అగ్ర దర్శకుడిగా ఎదిగానని అన్నారు. కానీ ఇప్పటి యువతలో చాలా మంది తమకు ఎవరూ సపోర్ట్ లేరని నిరాశ, నిస్పృహలో ఉన్నారని వారందరూ తన జీవితాన్ని ఆదర్శకంగా తీసుకుని జీవితంలో ఎదగాలని చెప్పారు. ఈ రోజు 71వ జన్మదిన వేడుకలను జరుపుకున్న ఆయనకి సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది కలిసి శుభాకాంక్షలు అందజేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ