మీ పేరు చివరన ఆ తోకలెందుకు?

March 02, 2015 | 01:06 PM | 57 Views
ప్రింట్ కామెంట్
dasari_comments_in_prasad_labs_niharonline

మనకెందుకులే అని ఊరుకునే మనస్తత్వం కాదు దర్శకరత్న దాసరి నారాయణరావుది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ తప్పనిపించిన ప్రతి విషయాన్నీ మీడియా ముందు పెట్టి తీవ్ర స్థాయిలో విమర్షిస్తుంటారు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రను కొంత మంది పెద్దలు కబ్జాచేశారని అన్నారు. అలాగే కొందరు థీయేటర్లను కబ్జా చేసుకున్నట్టే సినిమా చరిత్రను కూడా కబ్జా చేశారని అన్నారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులో నాయుడు తొలగించారని, కానీ కేవీ రెడ్డి, బీ ఎన్ రెడ్డి అవార్డులకు మాత్రం చివర అలాగే ఉంచారని మరి ఆ అవార్డులకు కులం పేరు అడ్డు గా లేదా అని ఆయన ప్రశ్నించారు. మరొక వ్యాఖ్య ఈ నాడు సినిమాలను హీరోలకు తగినట్టుగా దర్శకులు కథ తయారు చేస్తున్నారనీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగిన స్టోరీని ఇస్తున్నారనీ, ముందు స్టోరీని ఎంచుకుని నటులు స్టోరీకి తగ్గట్టు తమ బాడీ లాంగ్వేజ్ మార్చుకునేలా చేయాల దర్శకులను కోరారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ