ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న త్రిష త్వరలో పెళ్ళి పీటలమీద కూర్చోబోతోంది కూడా. తను వరుణ్ మణియన్ అనే వ్యాపారిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 23న చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య త్రిష, వరుణ్‌ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఎంతో సంతోషంగా ఉన్న వీరి జీవితంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వరుణ్ మణియన్‌ను చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఈ బెదిరింపులు ఫోన్ల లో జరుగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టీంకు దూరంగా ఉండాలని కూడా వార్నింగ్ ఇచ్చారట. ఈ మేరకు వరుణ్ మణియన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ టీం (సీఎస్‌కే)ను నటి త్రిషకు కాబోయే భర్త వరుణ్‌మణియన్ కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను వరుణ్ మణియన్ ఖండించాడు కూడా. అలాంటిదేమీ లేదని, ఇప్పుడే నిశ్చితార్థం జరుపుకుని చాలా సంతోషంగా ఉన్నామనీ, అలాంటి బరువు బాధ్యతలేమీ తీసుకునే ఆలోచన లేదని కూడా తన సమాధానాన్ని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. అయినా ఈ బెదిరింపులు ఎందువల్ల చేస్తున్నాయనే విషయంలో ఇంకా ఏ క్లారిటీ రాలేదు. ఈ విషయంపై పోలీసులు ఏ కోణం నుచి దర్యాప్తు చేస్తారనేది తెలియాల్సి ఉంది.