శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ముకుంద ఎంటర్టైనర్ అన్ని చోట్ల డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. మల్టీప్లెక్స్ లతో పాటు సింగల్ స్క్రీన్లు కూడా తొంభై శాతం ఓపెనింగ్స్ సాధించాయి. వరుసగా సెలవులు కావడంతో ఇంకా మంచి ఓపెనింగ్స్ సాధించడానికి సిద్దంగా వున్నాయి. మిక్కీ జె మేయర్ అందించిన మెలోడియస్ సంగీతంతో పాటు వరుణ్‌తేజ్ డెబ్యూ ఈ ఓపెనింగ్స్ కి కారణం అని చెప్పుకోవచ్చు. పూజ హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని నల్లమలుపు బుజ్జి, టాగోర్మధు సంయుక్తంగా నిర్మించారు.