అరెస్టును తప్పించుకున్న దీపిక

March 07, 2015 | 04:57 PM | 64 Views
ప్రింట్ కామెంట్
deepika_padukone_niharonline

బుల్లి తెర మీద నోరు జారితే ఇప్పుడు కోర్టు గడప ఎక్కాల్సి వస్తోంది. తస్మాత్ జాగ్రత్త. తెలుగు నవ్వుల ప్రోగ్రామ్ జబర్దస్త్ లో కూడా వేణు చేసిన స్కిట్ మీద కూడా ఆరోపణలు కేసులు నడుస్తున్నాయి. అలాగే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పొడుకొనే బుల్లితెర మీద నవ్వులు పూయించడానికి వాడిన భాష కోర్టు గడప ఎక్కేలాచేసింది. అయితే అరెస్టు నుంచి మాత్రం తప్పించుకోగలిగింది ఏఐబీ రోస్ట్ లో అసభ్య పదజాలం వాడిందన్న ఆరోపణ కేసులో దీపికను అరెస్టు చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ రంజిత్ మోరే, అనుజా ప్రదు దేశాయ్ లతో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం ఈ విషయమై పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. బుల్లి తెర నవ్వుల ప్రోగ్రామ్ ఏఐబీ రోస్ట్ లో పాల్గొన్నందుకు తనపై మోపబడిన కేసును రద్దు చేయాలని దీపిక ముంబయి హైకోర్టును కోరిందట. ఈ మేరకు 16న పిటిషన్ విచారణచేపట్టే వరకు ఆమెను అరస్టు చేయవద్దని న్యాయస్థానం స్పష్టంచేసింది. గత డిసెంబర్ లో జరిగిన ఈ నవ్వుల కార్యక్రమానికి సంబంధించి ఈ కేసులో ఇరుక్కుంది దీపిక. ఇందులో జుగుప్సాకరమైన పదాలను ఉపయోగించి చేసిన హాస్యం అక్కడున్న వారి నందరినీ నవ్వించినా, ఆ తరువాత మాత్రం విమర్శలు ఎదుర్కొని కేసుకు దారి తీసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ