మాది తండ్రీ-కూతుర్ల అనుబంధమే: దీపిక

May 06, 2015 | 09:47 AM | 137 Views
ప్రింట్ కామెంట్
deepicka_abithab_piku_niharonline

తండ్రీ కూతుర్ల అనుబంధమంటే త్రిష-ప్రకాష్ రాజ్ ల ఆకాశమంత సినిమా గుర్తుకు వస్తుంది. కొద్ది మంది నటులతో చాలా అద్భుతంగా తీశారీ సినిమాని డైరెక్టర్ రాధా మోహన్. ఇప్పుడు రాబోతున్న పీకూ సినిమా అలాంటిదే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నటి దీపికా పదుకొనే పేరు బాగా వినిపిస్తోంది. ‘మై ఛాయిస్’ వీడియో దీనికి ఒక కారణం కాగా...  రాబోతున్న కొత్త సినిమా ‘పీకూ’ మరో కారణం.  సుజిత్ సర్కార్ రూపొందిస్తున్న ‘పీకూ’లో అమితాబ్, దీపిక తండ్రీ కూతుళ్ళుగా నటించారు. ఇది వీరిద్దరి మధ్యే ప్రధానంగా నడుస్తున్నకథలా అనిపిస్తుంది. అయితే చాలా వరకూ తల్లిదండ్రులతో మాట్లాడలేని ఎన్నో అంశాలు స్నేహితులతో షేర్ చేసుకుంటుంటాం... ఇటీవల ట్రెండ్ మారిపోతోంది. ప్రేమ వ్యవహారాలు... మనసులో కలిగే భావాలను తల్లి దండ్రులు అర్థం చేసుకుంటున్నారు. ఇందులో అలాంటిదే ఉన్నట్టు దీపికా పడుకొనే చెపుతోంది. దీపిక సినిమా గురించి చెపుతూ ‘‘ఈ సినిమా కథ చెప్పగానే చాలా ఎక్సైట్ మెంట్ కలిగింది ఎప్పుడెప్పుడు ఈ సినిమా చేద్దామా అనిపించింది. ఒక స్వతంత్ర మహిళ ఒకపక్కన తన తండ్రి బాగోగులు, ఇంటి విషయాలు చూసుకుంటూ, మరోపక్క ఉద్యోగం చేయడమనే అంశాన్ని ఇందులో బాగా చూపారు. ఇంతకు ముందు అమితాబ్ తో ఓ సినిమా చేయడం వల్ల ఆయనతో చనువు ఏర్పడింది. ప్రతి దీపావళికి నన్ను ఆయన ఇన్వైట్ చేస్తారు’’ అన్నది. ‘‘ఆ దంపతులు వాళ్ళమ్మాయి శ్వేతతో సమానంగా ప్రేమ చూపిస్తారు నా మీద. నన్ను చూస్తే వాళ్ళకు వాళ్ళమ్మాయి గుర్తుకు వస్తుందట’’ అని చెప్పుకుంది దీపిక. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ