వావ్... కిరాక్ లుక్

August 01, 2015 | 12:41 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Tamasha_first_look_niharonline1

రియల్ లైఫ్ లో విడిపోతేనేం రీల్ లైఫ్ మళ్ళీ ఇద్దరినీ కలిపింది. ఈ ఇద్దరూ కలిసి ఇంతియాజ్ దర్శకత్వంలో ‘తమాషా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇద్దరూ అందగాళ్ళు అందులో కిరాక్ డ్రెస్ ఏసుకొని మరింత కిరాగ్గా పోజిస్తే ఫాన్స్ ఏమై పోవాలి. ఇక్కడ కనిపిస్తున్నది ఇంతియాజ్ ‘తమాషా’ చిత్రంలోని ఫస్ట్ లుక్.  దీపిక పదుకొన్ పికూ సినిమా తరువాత చేస్తున్న చిత్రం ఇది. ఓ వైపు కమర్షియల్ మసాలా సినిమాల్లో నటిస్తూనే వైవిధ్యానికి పట్టంగట్టే కొన్ని క్యారెక్టర్ల లో నటిస్తోంది. చెన్నయ్ ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పికూ ఈ మూడు సినిమాల్లో దీపిక రొటీన్ కు భిన్నంగా కనిపించింది. ఇప్పుడు తాజాగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 'తమాషా' అనే సినిమాలో వాటన్నిటికంటే డిఫరెంట్ లుక్ తో కనిపిస్తుందంటున్నారు.  ఈ లుక్ లో చిన్న పిల్లలా కనిపిస్తోంది అమ్మడు. డ్రెస్ దగ్గరినుంచి కింద చెప్పులవరకూ కిరాక్... కిరాక్ గా ఉంది. రణబీర్ న్యూ పంజాబీ లుక్ హెయిర్ స్టయిల్ తో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ అందమైన ప్రేమజంటను చూడ్డానికి కాలేజీ పిల్లలు రెడీ అయిపోతున్నారు. తమాషా చిత్రానికి ఇంతియాజ్ రచయిత కం డైరెక్టర్. నవంబర్ 27న ఈ సినిమా రిలీజవుతోంది. నడియావాలా గ్రాండ్సన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై షాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ