‘ధనలక్ష్మి తలుపు తడితే’ ప్రచారం అలా మొదలైంది…

May 02, 2015 | 05:45 PM | 139 Views
ప్రింట్ కామెంట్
Danalakshmi_Talupu_Tadite_Trailer_Launch_niharonline

మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో.. ధనరాజ్‌, మనోజ్‌నందం, అనిల్‌ కళ్యాణ్‌, విజయసాయి, రణధీర్‌, తాగుబోతు రమేష్‌, నాగబాబు, శ్రీముఖి, సింధుతులాని ముఖ్య తారాగణంగా.. భీమవరం టాకీస్‌ పతాకంపై ‘సాయి అచ్చుత్‌ చిన్నారి’ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రం టీజర్‌ హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో.. ‘అలా మొదలైంది’ నిర్మాత కె.యల్‌.దామోదర్‌ప్రసాద్‌`దర్శకురాలు నందినిరెడ్డిల చేతుల మీదుగా విడుదలైంది. రాజ్‌ కందుకూరి, వేమూరి సత్యనారాయణ, డార్లింగ్‌ స్వామి, సురేష్‌ కొండేటి తదితర చిత్ర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ధనలక్ష్మి తలుపు తడితే’ మేకింగ్‌ వీడియోస్‌ను కూడా రిలీజ్‌ చేసారు. చిత్ర యూనిట్‌ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ‘నిర్మాత రామసత్యనారాయణ ఏ సినిమా తీసినా.. చాలా ప్లాన్‌ ప్రకారం తీసి.. పది లక్షలకు తక్కువ కాకుండా సంపాదించుకుంటారు. కాబట్టి ‘ధనలక్ష్మి తలుపు తడితే’ కూడా కచ్చితంగా ప్రోఫిట్‌ మేకింగ్‌ సినిమా అవుతుంది’ అని అతిధులు ఆకాంక్షించారు. ‘కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ చిత్ర నిర్మాణంలో తాను భాగస్వామిని అయ్యానని.. తన మీద అభిమానంతో మనోజ్‌నందం, అనిల్‌ కళ్యాణ్‌, తాగుబోతు రమేష్‌ వంటి వారు రూపాయి పారితోషికం తీసుకోకుండా నటిస్తే.. మిగతావారు కూడా నామమాత్రం పారితోషికంతో పని చేసారని యాక్టర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ ధనరాజ్‌ అన్నారు. ‘ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేయడానికి మొదట్లో తాను కొంచెం సంకోచించానని.. కానీ ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాన’ని నిర్మాత రామసత్యనారాయణ అన్నారు. ‘తనపై ఎంతో నమ్మకంతో దర్శకుడిగా తనకు అవకాశం ఇవ్వడం వల్ల ఈ సినిమాను తాను ఎంతో బాధ్యతగా రూపొందించానని’ చిత్ర దర్శకులు సాయి అచ్యుత్‌ చిన్నారి అన్నారు. ‘టీజర్‌, మరియు మేకింగ్‌ విజువల్స్‌ బట్టి.. ‘ధనలక్ష్మి తలుపు తడితే’ కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోందని ‘అలా మొదలైంది’ దర్శకురాలు నందినిరెడ్డి, నిర్మాత దామోదర్‌ప్రసాద్‌ అన్నారు. ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్‌: వివా, సంగీతం: బోలో శావలి, కెమెరా: జి.శివకుమార్‌, ఎడిటింగ్‌: శివ వై.ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ప్రసాద్‌ మల్లు (యు.ఎస్‌.ఎ)`ప్రతాప్‌ భీమిరెడ్డి (యు.ఎస్‌.ఎ), సమర్పణ: మాస్టర్‌ సుక్కురామ్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`మాటలు`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సాయి అచ్యుత్‌ చిన్నారి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ