రఘువరన్ బిటెక్ తో తమిళ (విఐపి), తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ధనుష్ కు ఈ ఏడాది అనేగన్ తో మరో హిట్ కొట్టాడు. కానీ తెలుగులో మాత్రం అనేకుడుగా వచ్చిన ఈ సినిమా ఇక్కడ ఫ్లాపయ్యింది. తమిళంలో ఇప్పటి వరకూ విడుదలైన మూడు సినిమాల్లో రెండు డిజాస్టర్ జాబితాలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడింకా ఈయన చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయట. అందులో ఓ సినిమా షూటింగ్ కోసం మన విశాఖ నగరానికి రానున్నాడు.
ఈ సినిమాకి ట్రైన్ లో జరిగే యాక్షన్ సన్నివేశం చాలా కీలకమంటున్నారు. ఇందుకోసం దర్శకుడు కాస్త బడ్జెట్ పెంచి మరీ హాలీవుడ్ నిపుణుడిని దించాడు. సినిమా విషయంలో దర్శకుడు ఏమాత్రం తగ్గట్లేదట. అందుకే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు విశాఖలో చిత్రీకరించడం కోసం టీమ్ ని వెంటబెట్టుకుని విశాఖకు వస్తున్నాడు ప్రభు సాల్మన్ ధనుష్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్ విలన్ గా నటిస్తున్నాడు.