మామ సూపర్ స్టార్ అనిపించుకుంటే అల్లుడు సూపర్ టాలెంటెడ్ అనిపించుకుంటున్నాడిప్పుడు... వారెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. ధనుష్ కు ఎంత టాలెంట్ ఉన్నా అద్రుష్టం కలిసి రావాలి కదా. ఇన్నాల్టికి అతనికి కలిసొచ్చింది. తమిళంలో వీఐపీ టైటిల్ తో వచ్చిన సినిమాను తెలుగులో రఘువరన్ బిటెక్ గా తెలుగునాట విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇది సూపర్ డూపర్ హిట్ సినిమాగా ధనుష్ ఊహించని కలెక్షన్లు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఇదే సినిమాను సీక్వెల్ గా విఐపీ 2 గా తీయబోతున్నారు. ఆ సినిమా కాంబినేషనే ఈ సినిమాకూ పని చేస్తుందట. రఘువరన్ బిటెక్ తో దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ వేల్ రాజ్, అనిరుథ్ (సంగీతం), రఘువరన్ ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయారట. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యి, అయితే రెండో భాగంలో అమలా పాల్ ఉండదంటున్నారు. ఏప్రిల్ లో ఈ షూటింగ్ మొదలు పెట్టేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ధనుష్.