బాలకృష్ణ నటిస్తున్న లయన్ సినిమా షూటింగ్ పూర్తయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిని శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఆయన తరువాత సినిమాకు రెడీ అయిపోతున్నారు. దీని ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనూ ద్రుష్టిసారిస్తున్నారు బాల కృష్ణ. తన 99వ చిత్రానికి 'లౌక్యం' ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు 'డిక్టేటర్' అని టైటిల్ ఎన్నుకున్నట్టు కూడా ఇంతకు ముందే వెల్లడి చేశారు. ఎరోస్ ఇంటర్నెషనల్ ప్రొడ్యూస్ చేయనున్న 'డిక్టేటర్'ని మే నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లాలని యూనిట్ సభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేయడానికి తేదీలు వెతుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఇప్పటికే నయతారను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు కూడా తెలిసిందే. అయితే సింహ, శ్రీరామరాజ్యం తరువాత మూడోసారి నయనతార బాలయ్య సరసన నటించడం విశేషం.