ఏకకాలంలో నాలుగు భాషల్లో నిర్మితమైన తొలిచిత్రం ‘రెడ్ అలర్ట్’. ఈ చిత్ర నిర్మాత పి.వి.శ్రీరాంరెడ్డి సినిమా రంగం గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంత మంచి నిర్మాతను కోల్పోవడం తెలుగు సినిమా దురదృష్ణం అని డైరెక్టర్ చంద్రమహేష్ పెర్కొన్నారు. హెచ్.హెచ్.మహాదేవ్, రవి, అమర్, తేజ్, హీరోలుగా చంద్రమహేష్ దర్శకత్వంలో సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పీవీ శ్రీరాంరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రెడ్ అలర్ట్’. గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను నటుడు పోసాని కృష్ణమురళి ఆవిష్కరించారు. ఇటీవల పరమపదించిన నిర్మాత యూనిట్ సభ్యులు నివాళులు ఆర్పించారు. ఫిలింనగర్ లో మహా మృత్యుంజయ యాగం చేశారు. అయినా కూడా సినిమా పరిశ్రమలో చావులు ఆగటం లేదు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. సినిమా పెద్దలు కూడా ఈ విషయంలో అవేర్ నెస్ తీసుకోవాలని పోసాని కృష్ణమురళి అన్నారు. నాన్న చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ రోజు నాలుగు భాషల్లో సినిమాని విడుదల చేయాలని నాన్నగారు అనుకున్నారు. కానీ ఈలోపు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. త్వరలోనే ఆడియో, సినిమాని విడుదల చేస్తాంమని హీరో హెచ్.హెచ్.మహాదేవ్ అన్నారు. ఈ సినిమాతో నాలుగు భాషల్లో సంగీతం సమకూర్చే అవకాశం వచ్చిందని సంగీత దర్శకుడు రవివర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో తేజ, అమర్, వెనిగళ్ల రాంబాబు, శ్రీరాంచౌదరి, కళ్యాణ్ సమి, ప్రకాష్, చంద్రకిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జైపాల్ రెడ్డి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సుమన్, కె.భాగ్యరాజా, వినోద్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: శ్రీమతి పిన్నింటి శ్రీరాం రెడ్డి.