రాజమౌళి వరుణ్ తేజ్ ని తిట్టాడా?

September 02, 2015 | 04:15 PM | 8 Views
ప్రింట్ కామెంట్
rajamouli-suggest-varun-tej-kanche-trailer-niharonline.jpg

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వారసుల వలసలు ఎక్కువయి పోయాయి. ఒక్కో ఫ్యామిలీ నుంచి ఐదారుగురేసి హీరోలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నారు. మరి అదే టైంలో వారి నుంచి ప్రేక్షకులు ముఖ్యంగా ఆ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆశించే ఎలిమెంట్స్ అందుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. దీనిపై టాప్ దర్శకుడు రాజమౌళి సలహా ఇస్తున్నాడు. ఆయన ఇటీవలె క్రిష్ దర్శకత్వంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న కంచె సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు హీరోలు కావటం పెద్ద విషయం కాదు. చాలా ఈజీ. అదే సమయంలో వారి నుంచి ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తారో అది అందించాల్సిన అవసరం ఉంటుంది. వరుణ్ కూడా తనకంటూ ఓ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని కొరుకుంటున్నాను, ఇదే నేను తనకిచ్చే(వరుణ్) సలహా అని చెప్పాడు.

చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే విధానానికి స్వస్తి పలకాలని రాజమౌళి ఉద్దేశం. ఎంత సేపు తాతల పేర్లు, తండ్రుల పేర్లు, మామల పేర్లు చెప్పుకోవటం కాదు... అసలు వారు హీరోలుగా పనికి వస్తారా అన్నది ఆలోచించుకోవాలి. ముందు తమ టాలెంట్ ను చూపిస్తూ... దాంతో తమకంటూ ఓ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలన్నదే రాజమౌళి చెప్పిందాంట్లో ఆంతర్యం. ఫర్ ఎక్సాంపుల్ బన్నీ, తారక్ లు ఇదే కోవలోకి వస్తారు. వారు ఫ్యామిలీ మూలాలను వాడుకున్నప్పటికీ తమ స్వశక్తితోనే స్టార్లుగా రాణిస్తున్నారు కదా. అదన్నమాట.  అంతదాకా జక్కన్న వరుణ్ తేజ్ ని తిట్టాడో పొగిడాడో పక్కన పెట్టి పాజిటివ్ గా తీసుకుంటే మంచిది. ఇంతకీ ఇది ఎవరికి తాకాలో వారికి కరెక్టుగా తాకితే అదే చాలు...  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ