ఈ కథను ‘రభస’కు ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడట సంతోష్ శ్రీనివాస్. కానీ ఆయన ఏ హీరోనయితే అనుకున్నాడో... రభస ఫ్లాప్ వల్ల ఆ హీరో ‘నో’ చెప్పేశాడట. దర్శకులకు ఒక్కోసారి చిత్రాల ఫ్లాపుల వల్ల ఇలాంటి పరాభవాలు ఎదురవడం సహజం. అయితే మన తెలుగు మాంచి కిక్కిచ్చే హిట్ హీరో ఇలాంటి వేమీ ఆలోచించడట... కక్కిచ్చే హీరో అంటే అర్థమై పోయింది కదా... అదే నండీ...రవి తేజ. అంతకు ముందు ఈ దర్శకుడు ఎన్ని హిట్లిచ్చాడు? ఇటీవల ఓ సినిమా ఫ్లాపయింది... ఈ దర్శకుడితో చేస్తే వర్కవుట్ అవుతుందా? లాంటివి పట్టించుకోకుండా అతను వినిపించిన కథ ఎలా ఉందని మాత్రం చూస్తాడట రవి తేజ. నచ్చితే డైరెక్టర్ డైరెక్టరీ పట్టించుకోకుండా ఓకే చెప్పేస్తాడట. అలా ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ కథకు ఓకే చెప్పాడట ఆ హీరో.... డి.వి.వి. దానయ్య నిర్మాతగా ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ హీరోకి ఈ టైటిల్ సూటవుతుందా... లేదా మీరే చెప్పండి....?