దర్శకుడు ఆర్.కె.సెల్వమణి..మాజీ హీరోయిన్ రోజా భర్త. ప్రస్తుతం సినిమాలకు పెద్దగా దర్శకత్వం చేయడం లేదు. దాంతో ఆయన చూపు నటన వైపు మల్లింది. తాజాగా 'వైగై ఎక్స్ ప్రెస్' అనే చిత్రంలో సెల్వమణి విలన్ గా నటించనున్నాడట. ఈ చిత్రంలో సెల్వమణి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని, కచ్చితంగా ఈ సినిమాతో సెల్వమణికి నటుడిగా మంచి పేరు వస్తుందని యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.