ప్రభాస్ కు జోడీ అవుతుందా?

May 22, 2015 | 03:12 PM | 49 Views
ప్రింట్ కామెంట్
Prabhas_aliyabhat_niharonline

అసలే ఆజానుబాహుడు... అందులో బాహుబలి కోసం మరింత గండరగండుడయ్యాడు... ఇంతటి ఫిజిక్ కు జోడీ అయిన అమ్మాయి కావాలంటే ఉన్న వాళ్ళలో అయితే... అనుష్కే కరెక్టు... కానీ బాహుబలి తరువాత ప్రభాస్ తో సినిమా చేస్తున్న దర్శకుడు సుజీత్ కు కొత్తమ్మాయి కావాలట. అన్నీ కొత్త కొత్తగా ఉండాలనుకునే ఈ దర్శకుడికి ముందు హీరోయిన్ ఫేస్ కొత్తగానే కనిపించాలంటున్నాడు. మరి ఈ కొత్తమ్మాయి బాలీవుడ్ భామ అలియా భట్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆమెను సంప్రదించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ అమ్మడు తెలుగులో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోందట... కానీ ముందుగా ఎన్టీఆర్ పక్కన చేయాలనుకుంటున్నానని ఓ సందర్భంలో అన్నది. మరి ప్రభాస్ కు జోడీగా అంటే అంగీకరిస్తోందో లేదో అన్న సందేహం... అంతా బాగానే ఉంది కానీ ప్రభాస్ హైట్ కు, వెయిట్ కు... హీరోయిన్ వయసంటే ఎవరూ పట్టించుకోరనుకోండి... అన్నిట్లోనూ సగం కూడా ఉండని అలియా భట్ ప్రభాస్ కు ఈడూ.. కాదు కాదు జోడీ కుదురుతుందా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ