అమలా పాల్ పెళ్ళయిన మరునాటి నుంచే సినిమా షూటింగ్ లకు హాజరవుతుండడంతో, ఆమె పెళ్ళి తరువాత కూడా నటిస్తుందా? అన్న ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్న అనుమానాలు. సాధారణంగా పెళ్ళి తరువాత హీరోయిన్లంతా సినిమాకు గుడ్ బై చెప్పడం సర్వసాధారణం కానీ, అమలా పాల్ ఇప్పటికీ షూటింగుల్లో పాల్గొంటూనే ఉంది. దీనికి ఆమె భర్త దర్శకుడు విజయ్ క్లారిటీ ఇచ్చాడు. ఒక్క హైకూ సినిమాకు తప్ప మిగతా వన్నీ పెళ్ళికి ముందు ఒప్పకున్న సినిమాలే నట. హైకూ సినిమా ఒప్పుకోడానికి కారణం ఆ దర్శకుడు పాండిరాజ్, హీరో సూర్య తనకు క్లోజ్ ఫ్రెండ్స్ కావడమే నట. ఒప్పకున్న సినిమాలు కంప్లీట్ చేయడంతో పాటు స్నేహితుల సినిమా కూడా పూర్తి చేస్తుందని చెప్పాడు. అంటే పెళ్ళి తరువాత నటించకూడదా? అనే క్వశ్చన్ చేయలేదు కాబట్టి... ఇంత బాగా క్లారిటీ ఇచ్చాడంటే... ఇక అమల ఆ తరువాత నటించదనే కదా అర్థం.