మే 23న పుట్టిన గురుశిష్యులు...

May 23, 2015 | 12:36 PM | 62 Views
ప్రింట్ కామెంట్
k_raghavendrarai_y_v_s_choudari_birthday_special_niharonline

సినిమా అభిమానులకు కె.రాఘవేంద్రరావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఆయన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే పండ్లు, పూలు, హీరోయిన్ అందందాలూ... అందమైన పాటలు... ఇలాంటి సినిమాలకు స్రుష్టి కర్త దర్శకేంద్రుడు అని చెప్పాలి. ఈ మధ్య టీవీలో ‘సౌందర్యలహరి’ ద్వారా వారి సినిమాల గురించి... నటీనటులతో ఆ నాటి విషయాలను చర్చించుకునే చక్కటి కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఆయన పుట్టిన రోజు మే 23 సందర్భంగా మరొక్కసారి ఆయన ప్రతిభను గుర్తు చేసుకుందాం...

  ఇక విశ్వ విఖ్యాత నటరత్న నందమూరి తారక రామారావు దివ్య మోహన రూపానికి ఆకర్షితుడై, తెలుగు సినిమా రంగం లోకి ప్రవేశించిన యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి పుట్టిన రోజు కూడా మే 23. అయితే చౌదరి గురువుగారు కె.రాఘవేంద్రరావు. ఈ ఇరువురి పుట్టిన రోజుల సందర్భంగా వారి గురించిన విశేషాలు కొన్ని....

కె.రాఘవేంద్రరావు: తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడుగా పేరు తెచ్చుకున్న  దర్శకుడు కోవెలమూడి రాఘవేంద్రరావు . ఆయన మే 23, 1942న కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించారు.  1975లో తన సినీ జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు చిత్రంతో  ప్రారంభించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
     ఎన్టీఆర్, జయసుధ, జయప్రద నటీనటులుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవిరాముడు (1977). ఈయనకు ఎన్టీఆర్ తో ఇది తొలి చిత్రం.... ఈ చిత్రం సక్సెస్ తరువాత ఎన్నో సినిమాలు ఈ సినిమాను అనుసరించిన కథలతో వచ్చాయి. తరువాత మళ్ళీ ఎన్టీఆర్- శ్రీదేవి కాంబినేషనల్ లో వేటగాడు తీశారు. ఇందులో ఎన్టీఆర్ మనుమరాలిగా నటించిన శ్రీదేవిని హీరోయిన్ చేయడం విశేషం. రాఘవేంద్రరావు లిస్టులో తరువాత వచ్చిన హిట్  చిత్రాల్లో బొబ్బిలి బ్రహ్మన్న (1984) ఒకటి. అప్పటికీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అందువల్ల ఈ సినిమా ఛాన్స్ క్రుష్ణం రాజుకు దక్కింది. రాఘ వేంద్రరావు సినిమాలంటే పువ్వులు, పండ్లు, హీరోయిన్‌ అందచందాలు, లొకేషన్లు, భారీ సెట్లకు ప్రత్యేక ఒరవడి స్రుష్టించారు. ఆ తరువాత కొత్త కథతో అమ్మాయిల ఊహలను, కలలను అందంగా తెరమీద చూపించిన సినిమా పదహారేళ్ల వయసు. పదహారేల్ల పడుచు ప్రాయాల యవ్వనపు రోజులను రక్తి కట్టిస్తూ  రాఘవేంద్రరావు  దర్శకత్వం వహించిన సినిమా. ఈ సినిమా గురించి ఇందులో పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 1990లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమా జగదేకవీరుడు- అతిలోక సుందరి.  చిరంజీవి హీరోగా వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో ఓ కొత్త ప్రయోగం అని చెప్పవచ్చు. శ్రీదేవి అప్పటి వరకూ శ్రీదేవి... ఆ సినిమా నుంచి అతి లోక సుందరి అయిపోయింది.  ఇక 1990 లో విక్టరీ వెంకటేశ‌్ , టబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా కూలి నెం..1.  ఇందులో ఇళయ రాజాతో తొలిసారిగా పాట పాడించారు. చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ తరువాత పెళ్లి సందడి వంటి మ్యూజికల్‌ హిట్‌ ఒకటి తీశారు.

ఇక ఆయన దర్శకత్వంలోని 100వ చిత్రం గంగోత్రి. అల్లు అర్జున్‌కు ఎంతో పాపులారిటీ తెచ్చింది ఈ సినిమా. ప్రేమ కధా చిత్రాలను, శృంగార కధా చిత్రాలను కొత్తదనంలో రూపొందించడంలో నెంబర్ వన్ దర్శకుడు అనిపించుకున్న కె.రాఘవేంద్రరావు అన్ని రకాల సినిమాలను టచ్ చేశారు. ఆధ్యాత్మిక చిత్రాల రూపకల్పనలో కూడా ఆయనకు ఆయనే సాటి. అన్నమయ్య, మంజనాథ, శ్రీరామదాసు వంటి సినిమాలతో ప్రేక్షకులను భక్తిసాగరంలో ముంచెత్తారు. చిరంజీవి నటించిన శ్రీ మంజునాథ, బాలకృష్ణ నటించిన పాండురంగడు వంటి భక్తి చిత్రాలు దర్శకేంద్రుడి ప్రతిభాపాటవాలను నిరూపిస్తాయి. నాగార్జునతో సాయిబాబా తీసి, ప్రేక్షకుల మన్ననలు పొందారు.  తెలుగు సినీ రంగంలో ఆయన చేసిన కృషికి 2009లో బి.ఎన్‌.రెడ్డి నేషనల్‌ అవార్డును రాఘవేంద్రరావు అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుల్లో మొదటి పది స్థానాల్లో రాఘవేంద్ర రావు పేరు చిరస్థాయిగా నిలిచి పోతుంది.

 

వై.వి.ఎస్.చౌదరి: 80వ దశకం లో తెలుగు సినిమా రంగం లోకి ప్రవేశించి,  కె .రాఘవేంద్ర రావు, రామ్ గోపాల్ వర్మ, మహేష్ బట్, కృష్ణ వంశీ  ల వద్ద దర్శకత్వ శాఖ లో  పని చేసి ,అక్కినేని  నాగార్జున సొంత  బ్యానర్ లో 'శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి ' చిత్రం తో దర్శకుడిగా మారాడు. ఎన్నో ఏళ్ళుగా మేకప్ వేయని నందమూరి హరి కృష్ణ తో,   అక్కినేని  నాగార్జున, కాంబినేషన్ లో 'సీతా రామ రాజు ', మహేష్ తో 'యువరాజు ', చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత  'బొమ్మరిల్లు వారి ' అని తన సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి 'లాహిరి లాహిరి లాహిరిలో, చిత్రం స్వీయ దర్శకత్వం లో నిర్మించారు. నందమూరి హరి కృష్ణ తో పాటు భారి తారగణం తో రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ గా నిలచింది. ఆ తరువాత మళ్లి హరి కృష్ణ, సిమ్రాన్ తో 'సీతయ్య ' రామ్ ఇలియానా పరిచయం చేస్తూ  'దేవదాసు' , నట సింహం బాల కృష్ణ తో 'ఒక్క మగాడు' ఇటివల విడుదలైన 'రేయ్' చిత్రాలు  స్వీయ దర్శకత్వం లో నిర్మించారు.వై .వి .యస్ .చౌదరి దర్శకత్వం వహించినవి తొమ్మిది  చిత్రాలైతే   ప్రొడ్యూస్ చేసిన చిత్రాలు ఆరు. సినీ పరిశ్రమ లో సక్సెస్స్ ప్లాప్స్ అనేవి సహజమే,కాని  వై వి యస్ విషయానికొస్తే, విజయాలే ఎక్కువ. ఆయన తీసే  ప్రతీ సినిమా గ్రాండియర్ ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. తన బ్యానర్ అయిన వేరే బ్యానర్ అయిన కర్చు కు ఏ మాత్రం వెనుకాడని దర్శకుడు వై వి యస్.ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమకు వెంకట్ ,చాందిని , ఆదిత్య ఓం ,అంకిత , రామ్ , ఇలియానా,  సాయి ధరం తేజ్ లాంటి సక్సెస్స్ ఫుల్  నటి నటులను పరిచయం చేసారు. తెలుగు సినీ పరిశ్రమ లో అన్ని రంగాల్లో అనుభవం గడించిన చౌదరి, దర్శక నిర్మాత గానే కాకుండా, మంచి కధకుడుగా, పంపిణి దారిడిగా ,ప్రదర్శనదారుడిగా కూడా ఖ్యాతి గడించాడు.   ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ లో (ఇండియా లో లేరు )  ఆయన మాట్లాడుతూ : " విశ్వ విఖ్యాత నటరత్న నందమూరి తారక రామ రావు పై వున్నా అభిమానంతో తెలుగు సినీ పరిశ్రమ లో రావడం జరిగింది. నాతో పని చేసిన వారందరి సహకారంతో   నేను నిర్మించిన , దర్శకత్వం వహించిన చిత్రాలని ఆదరించిన ప్రేక్షక మహాశయులకు, అందరు అభిమానులకు నా ధన్య వాదాలు. ఇంకా మున్ముందు కూడా మీ ఆదరణ ఈలాగే ఉంటుందని ఆశిస్తున్నాను.  అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ